యువరాజ్ సింగ్‌ను కలిసిన రిషబ్ పంత్.. మళ్లీ ఎగరబోతున్నాడు..

శుక్రవారం, 17 మార్చి 2023 (15:52 IST)
Yuvraj-Pant
టీమిండియా స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్‌ను భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కలిశాడు. ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. కాళ్లతో పాటు పలు శరీర భాగాలకు తీవ్రగాయాలకు శస్త్ర చికిత్సలు కావడంతో నెలకు పైగా ఆస్పత్రిలో వున్న పంత్ ఇటీవలే ఇంటికి చేరుకున్నాడు. 
 
ఊతకర్ర సాయంతో నడుస్తున్నాడు. తాజాగా భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. పంత్ ఇంటికి వెళ్లి అతడిని పరామర్శించాడు. పంత్ తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 
 
బుడి బుడి అడుగులు వేస్తోన్న ఈ ఛాంపియన్ మళ్లీ ఎగరబోతున్నాడని.. యువరాజ్ కూడా ఇన్ స్టాలో పేర్కొన్నాడు. కాగా, పంత్ ఈ ఏడాది ఐపీఎల్‌తో పాటు స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచ కప్‌లో కూడా పాల్గొనే అవకాశం లేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు