మేడమ్... చాముండి నుంచి రక్షణ కల్పించండి..!

ఏసీఏ మాజీ కార్యదర్శి చాముండేశ్వరి నాథ్‌పై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మహిళా క్రికెటర్లు మోనికా సాయి, రమాదేవి శనివారం రాష్ట్ర హోం మంత్రి సబిత ఇంద్రారెడ్డితో తెలిపారు.

అందుచేత చాముండేశ్వరి నాథ్ నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ మహిళా క్రికెటర్లు హోమంత్రిని కోరారు. తన సోదరుడిని చాముండి అనుచరులు కిడ్నాప్ చేశారని రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కేసు విషయంలో విజయవాడ పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని 164 సెక్షన్ కింద తమ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకోకుండా కాలాయాపన చేస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు.

వెబ్దునియా పై చదవండి