ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన విద్యార్థి, వరంగల్‌కు చెందిన విద్యార్థిని, నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన ఇద్దరు విద్యార్థినులు, మరో ముగ్గురు విద్యార్థులు కలిసి నాలుగు బైక్‌లపై ఆదివారం ములుగు జిల్లా వాజేడుకు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో రింగ్ రోడ్డు మీదుగా హనుమకొండ జిల్లా కోమటిపల్లి వరకు చేరుకుని విశ్రాంతి కోసం కొద్దిసేపు ఆగారు.
మిగతా మిత్రులు బాధితురాలిని వరంగల్‌లో ఆమె ఇంటికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు సోమవారం కేయూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.