నాలుగు మంచి మాటలు చెప్పి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఐదో తరగతి విద్యార్థినిని లైంగికంగా వేధించారు. ఈ దారుణం ఏపీలోని బాపట్ల జిల్లా కేంద్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఆ బాలిక తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడిని నిలదీయగా, తాను అలాంటి పనులకు పాల్పడలేదని చెప్పారు. దీంతో వారు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ వెంకటేశులు, పట్టణ సీఐ శ్రీనివాసులు.. బాధితురాలు, కుటుంబ సభ్యులను విచారించి వివరాలు నమోదు చేశారు. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.