అసలే ప్రతిపక్ష పార్టీ నేతలను ఎపిలో తిరగనీయకుండా చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఇది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రతిపక్ష పార్టీల నేతలందరూ పార్టీ నుంచి వెళ్ళిపోవడం.. కొంతమంది పార్టీలో ఉన్నా సైలెంట్‌గా ఉండిపోవడం జరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు ఆ పార్టీ అధినేత నారాచంద్రబాబునాయుడు.
కరోనా సమయం కాబట్టి ఇప్పుడు ఫోన్లోనే బిజెపి ముఖ్య నేతలతో మాట్లాడి... ఆ తరువాత నేరుగా బిజెపి నేతలను కలిసి ఈ ప్రతిపాదన పెట్టేందుకు సిద్ధమవుతున్నారట చంద్రబాబు. విషయం కాస్త ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు తెలిసిందట. అయితే ప్రస్తుతానికి బాబు ట్రయల్‌లోనే ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుందో చూద్దామన్న ధోరణితో కన్నా ఉన్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి చంద్రబాబు ప్రయత్నం ఫలిస్తుందో లేదోనన్నది.