వీరిద్దరు సినీరంగంలో పోటాపోటీ. ఇద్దరికి వేలమంది అభిమానులున్నారు. అభిమానులంటే అలాంటి ఇలాంటి వారు ప్రాణమివ్వడానికైనా సిద్ధపడే అభిమానులు. ఇప్పుడు వారు రాజకీయాల్లోకి వచ్చారు. ఒకరు రాజకీయాల్లోకి వచ్చేసి ప్రజాప్రతినిధిగా ఉంటే మరో హీరో రాజకీయాల్లో కాలు పెట్టి ప్రజాప్రతినిధిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. వీరి మధ్య ప్రస్తుతం స్టార్ వార్ జరుగబోతోంది. అందుకు సమయం కూడా దగ్గరపడింది. ఇంతకీ ఎవరా నటులు.. ఏమా కథ రీడ్ దిస్ స్టోరీ.
ఒకరేమో నందమూరి బాలకృష్ణ, మరొకరేమో పవన్ కళ్యాణ్. ఇప్పటికే మీకు అంతా అర్థమైపోతుంది. బాలకృష్ణ ఇప్పటికే హిందూపురం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పోటీ చేయడానికి సిద్ధమంటున్నారు. అది కూడా కరువు ప్రాంతంగా చెప్పుకుంటున్న అనంతపురం జిల్లా నుంచే. అనంతపురం జిల్లా నుంచి అంటే అనంతపురం నియోజకవర్గం నుంచే. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నానని చెప్పడంతో అధికార, ప్రతిపక్ష నేతల్లో గుబులు పట్టుకుంది. ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు.
దీంతో స్టార్ వార్ మొదలుకానుంది. ఎక్కడో హిందూపురంలో ఉండే బాలకృష్ణ పవన్ పోటీ చేసే అనంతపురంలోకే వస్తున్నారంటే ఇక అర్థం చేసుకోవచ్చు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఢీకొందామనేది అర్థం. వీరిద్దరి మధ్య గొడవతో ఏం జరుగుతుందోనన్న భయంలో ఉన్నారు అనంతపురం జిల్లా ప్రజలు. ఒకవేళ ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో మాత్రం రసవత్తరమైన పోరు జరగడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.