కారం - సరిపడా
చాట్ మసాలా - కొద్దిగా
తయారీ విధానం:
పూరీ: ముందుగా గిన్నెలో బొంబాయి రవ్వను వేసుకుని అందులో మైదాపిండి, ఉప్పు బాగా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా కొద్దిగా నీటిని పోసి కలుపుకుంటూ 15 నిమిషాల పాటు ఆ ముద్దను తడిగుడ్డలో చుట్టి ఉంచాలి. ఇలా చేయడం వలన రవ్వ నీటిని పీల్చుకుని పిండి మృదువుగా మారుతుంది. ఇప్పుడు ఆ పిండిని ఉండలుగా చేసి చపాతీలా రుద్ది దానిలో ఏదైనా మూతతో చిన్నవిగా కట్ చేసుకోవాలి. ఇక పెనంలో నూనెను వేసి కాగిన తరువాత వాటిని బంగారురంగు వచ్చేంత వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
స్టఫింగ్ కోసం: గిన్నెలో బాగా ఉడకించి పొట్టు తీసిన బంగాళాదుంప, ఉడికించిన పచ్చిబఠాణీలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కాస్త కారం పొడి, చాట్ మసాలా, ఉప్పు వేసి మిశ్రమంగా కలుపుకుని ఉంచుకోవాలి.
పానీ: గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా ఆకులు, అల్లం, పచ్చిమిర్చి వీటిని మిక్సీలో వేసి కొంత నీటిని కలిపి ద్రవం లాగా చేసుకోవాలి.