ఆక్టోపస్ అంటే ఎనిమిది కాళ్లు వుండే జీవి. దీనికి వెన్నెముక లేదు. వెన్నెముక లేని జీవులలో కెల్లా ఆక్టోపస్ చాలా తెలివైనది. ఆక్టోపస్ శరీరం లోపల గానీ బయట గాని అస్తిపంజరం లేకపోవడం వల్ల చిన్న చిన్న ప్రదేశముల్లో కూడా చాలా సులువుగా దూరిపోతుంది.
కొన్ని ఆక్టోపస్‌లు ఆరు నెలలు మాత్రమే ప్రాణముతో ఉంటాయి. మగ ఆక్టోపస్‌లు మేటింగ్ తర్వాత కొద్ది నెలలకే చనిపోతాయి. ఆక్టోపస్ శరీరంలో ఉండే రెండు ఆప్టిక్ గ్రంథుల నుంచి వెలువడే ఎండోక్రైన్ స్రావాల వల్ల జన్యుపరంగా ముందుగానే నిర్ణయించబడిన మరణం సంభవిస్తుంది.
అయితే శాస్త్రజ్ఞులు ఈ గ్రంథుల్ని ఆపరేషన్ ద్వారా తొలగిస్తే ఆక్టోపస్‌లు ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉంటుందని అంటున్నారు. కావున ఆక్టోపస్‌ల జీవిత కాలం చాల తక్కువేనని చెప్పాలి. అయితే ఆక్టోపస్‌ల మరణానికి వాటి పునరుత్పత్తే కారణం అవుతుంది.