కలబందను మజ్జిగలో కలిపి తీసుకుంటే..?

శుక్రవారం, 12 అక్టోబరు 2018 (09:53 IST)
పెరట్లో పెరిగే కలబంద మనిషి ఆయుష్షును పెంచేందుకు కూడా ఉపయోగపడుతుందని పరిశోధనలలో చెబుతున్నారు. కలబందలోని విటమిన్స్, ప్రోటీన్స్, క్యాల్షియం వంటి పోషక విలువలు మూత్రపిండిల్లోని రాళ్లను కరిగించుటకు సహాయపడుతాయి. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
 
40 ఏళ్లు దాటిన వారికి జీవకణాలు నశించిపోతాయి. దాని వలన నీరసం, అనారోగ్యాలు, వృద్ధాప్యం, మతిమరుపు వంటి సమస్యలు ఏర్పడుతాయి. కలబందను మజ్జిగలో కలిపి తీసుకుంటే ఈ సమస్యలు అరికట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీర వేడిని తగ్గిస్తుంది. కలబంద తరచుగా తీసుకోవడం వలన గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవని వారు చెప్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు