వీరి పరిశీలనలో నిద్రలేమి వల్ల చిన్న చిన్న విషయాలపై కూడా అనవసరంగా తగాదాలు చోటుచేసుకుంటాయని తేలింది. దంపతుల మధ్య నిద్రలేమి కారణంగానే ఇలాంటి తగాదాలు చోటుచేసుకుంటాయని, అంతేకాకుండా నిద్రలేమి వల్ల ఆరోగ్యం కూడా పాడౌతుందని, చిరాకుతో నిద్రలేమి అనుబంధాలపై ప్రభావం చూపి బాంధవ్యాలు దెబ్బతీసే పరిణామాలకు దారి తీస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.