రొయ్యలు ఆ సామర్థ్యాన్ని పెంచుతుందట..

మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (15:46 IST)
మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడుతుంది. సరైన ఆహార ప్రణాళికను పాటించే వారికి అనారోగ్య సమస్యలు రావని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కూరగాయలు లాగానే మాంసాహారంలో కూడా అనేక పోషకాలు ఉంటాయి. మాంసాహారంలో రొయ్యలు అంటే చాలా మందికి ఇష్టం. ఇవి కొద్దిగా ధర ఎక్కువే అయినప్పటికీ వీటిని తినడం వలన శరీరానికి మంచి ప్రయోజనం ఉంటుంది. 
 
రొయ్యల్లో జింక్ హెచ్చుస్థాయిలో ఉంటుంది. మగవారు వీటిని తీసుకోవడం వలన లైంగిక సామర్థ్యం పెరగడమే కాకుండా వీర్యవృద్ధికి తోడ్పడుతుంది. సంతాన సాఫల్యతకు తోడ్పడుతుంది. అంతే కాకుండా ఇందులో ఉండే మెగ్నీషియం, క్యాల్షియం కండరాలకు, ఎముకలకు బలాన్ని చేకూరుస్తాయి. ఫెనిలాలనైన్ అనే ఎమినో యాసిడ్ మనోభావాల్ని నియంత్రిస్తూ శృంగార వాంఛల్ని పెంచుతుంది. 
 
చర్మకాంతికి తోడ్పడే విటమిన్ ఇ, విటమిన్ బి 12 రొయ్యల్లో లభిస్తాయి. అంతేకాకుండా శరీర నిర్మాణకణాల అభివృద్దికి ఉపకరించే సత్తువ కూడా రొయ్యల్లో ఉంటుంది. వీటిలో తక్కువ క్యాలరీలు ఉండటం వలన బరువు నియంత్రణలో ఉంటుంది. 
 
రొయ్యల్లోని సెలీనియమ్ క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటుంది. వీటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ గుండె రక్త నాళాల్లో పూడికలు రానివ్వదు. రొయ్యలు రుచికరంగా ఉంటాయి కదా అని ఎక్కువ నూనెతో వేయించిన వేపుళ్లను తినకూడదు. తక్కువ నూనెతో చేసిన రొయ్యల కూర, వేపుళ్లు తినవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు