నల్లద్రాక్షలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కాలేయానికి ద్రాక్షలు అవీ ఎండు ద్రాక్షలు ఎంతో మేలు చేస్తాయి. రాత్రి పూట ద్రాక్షలను అంటే ఎండు ద్రాక్షలను నీటిలో నానబెట్టి ఆ నీటిని, ద్రాక్షలను తీసుకోవడం ద్వారా కాలేయం శుభ్రమవుతుంది. కాలేయాన్ని ఆరోగ్యాన్ని వుంచుకుంటే వృద్ధాప్య ఛాయలు దరిచేరవు.
అంతేగాకుండా.. పొడిదగ్గు ఉంటే, బాదం గింజల్ని రెండు గంటల పాటు నీళ్లల్లో నానపెట్టి తినేయవచ్చు. ఉల్లిగడ్డను దంచి, దాంట్లో నిమ్మరసం కలిపి, నీళ్లల్లో మరిగించి తీసుకుంటే త్వరితంగా ఉపశమనం లభిస్తుంది. పసుపు చెట్టు వేర్లను ఎండబెట్టి, పొడి చేసి, తేనెతో కలిపి తీసుకుంటే చలికాలంలో జలుబు, దగ్గు మాయమవుతాయి.