నరాల మీద పొర దెబ్బతినే వ్యాధిని న్యూరోలేమా అంటారు. ఆహారపరమైన లోపాలే ఈ సమస్యకు ప్రధాన కారణంగా ఉంటాయి. ప్రతిరోజూ సరియైన వేళకు భోజనం చేయకపోవడంతో పాటు ఉప్పు, మసాలాలు, పచ్చళ్లు అతిగా తినడం కూడా ఇందుకు కారణమే. తేన్పులు, కడుపు ఉబ్బరం ఎక్కువగా ఉండేవారిలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
దానికి వంకాయ, పులుపు పదార్థఆలు తగ్గించాలి. నీరు అధిక మోతాదులో తీసుకోవాలి. నిద్ర సమయం తగ్గకుండా చూసుకోవడం ఎంతైన ముఖ్యం. బియ్యపు తవుడులో మంటలను తగ్గించే బి విటమిన్ ఉంటుంది. అందువలన దంపుడు బియ్యం వాడడం మరీ మంచిది. అలానే తవుడుతో తయారుచేసే రైస్‌బ్రాన్ నూనె వాడడం వలన కూడా ప్రయోజనం ఉంటుంది. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.