బరువు తగ్గాలా? పోషకాహారం తీసుకోండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. హెల్దీడైట్‌లో పిండిపదార్థాలను తీసుకోండి. శరీరానికి అవసరమైన ప్రొటీన్లు పిండిపదార్థాల ద్వారానే ఎక్కువగా అందుతాయి. శరీరానికి శక్తినిచ్చేవి కూడా అవే. పిండి పదార్థాలు తీసుకుంటేనే మంచి నిద్ర పడుతుంది. అన్నంతోపాటు బ్రెడ్, చపాతీలు, రవ్వ వంటలు, నూడుల్స్, పాస్తా డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.
అలాగే పండ్లు, కూరగాయలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్లను అడ్డుకోవాలంటే.. కాయగూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో ఆంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా రోగనిరోధకశక్తి పెరుగుతుంది. రెగ్యులర్‌గా పళ్లు తీసుకోవడం వల్ల వయసు వేగానికీ కళ్లెం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.