తలనొప్పులు చాలా రకాలున్నాయి. ఉదాహరణకు ఎక్కువ సమయం నిద్రపోతే లేదా తక్కువ సమయం నిద్రపోతే, నిద్ర సరిగా పట్టకపోతే కూడా తలనొప్పి అధికంగా ఉంటుంది. కొన్ని సార్లు నిద్రనుండి మధ్యమధ్యలో మేల్కొంటుంటే కూడా తలనొప్పి వస్తుంది.
దంతాలలో తీవ్రమైన నొప్పి ఉండడంతో తలనొప్పి వస్తుంది. దంతాల్లో క్రిములు ఉండడం, జ్ఞానదంతం రావడం, తదితరాల కారణంగా తలనొప్పి రావడం జరుగుతుంటుంది. మానసికపరమైన ఒత్తిడి కారణంగా కూడా తలనొప్పి వస్తుంది. దీంతో పాటు నిద్రలేమి, అలసట తదితరాల కారణంగా తలనొప్పి వస్తుంది. కళ్ళజోళ్లు మార్చకపోయినా తలనొప్పి వస్తుంటుంది. విపరీతంగా తలనొప్పి వస్తుంటే కంటి నిపుణుల వద్దకు వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి.
అప్పుడప్పుడు కొన్ని మందులు, మాత్రల ప్రభావంతోనూ తలనొప్పి వస్తుంటుంది. ఉదాహరణకు గుండె జబ్బులకు సంబంధించి వాడే మాత్రలు, మందులు, రక్తపోటును అదుపులో ఉంచేందుకు వాడే మాత్రల ప్రభావంతో తలనొప్పి వస్తుంది.