కందలో ఉండే పొటాషియం, ఫైబర్, సహజమైన చక్కెర మనకు చాలా తక్కువ క్యాలరీస్‌తోనే ఎక్కువ బలం లభించేలా చేస్తాయి. అంతేకాకుండా కంద క్యాన్సర్ బారిన పడకుండా కాపాడటమే కాక ప్రొస్టేట్ క్యాన్సర్ నివారణకు దివ్యమైన ఔషధంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కంద చంటి పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరికి మేలు చేస్తుంది. గర్భిణులకు చేసే మేలు అంతాఇంతా కాదు. పుట్టబోయే బిడ్డకు కూడా ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని ఇస్తుంది. అంతేకాకుండా జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది.