ఒకటిన్నర రోటీ = ఒక మామిడి: అన్నంతో తినొచ్చా.. భోజనం చేసిన తర్వాత?

శుక్రవారం, 3 జూన్ 2016 (13:13 IST)
మామిడి పండును మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకునేందుకు భయపడుతుంటారు. అయితే మామిడిని డయాబెటిస్ పేషంట్లు మోతాదుకు మించి తీసుకోకూడదనే కానీ.. మితంగా తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మామిడి పండ్లలో ఫోలిక్ యాసిడ్ విటమిన్ ఎ, బి6, సి వుండటం ద్వారా డయాబెటిస్ పేషెంట్లు రోజుకు రెండు ముక్కలు తీసుకోవచ్చునని చెప్తున్నారు. 
 
ఒక మామిడి ఒకటిన్నర రోటీలో ఉన్న కేలరీలకు సమానం. అందుకే పరిమితంగా తీసుకోవడం ద్వారా షుగర్ లెవల్స్ అదుపులో వుంటాయి. వారానికి ఓ మామిడి పండును తినడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ ఒక మామిడి పండు తిన్నంత మాత్రాన రక్తంలో గ్లూకోజ్ పెద్దగా పెరిగిపోదని వైద్యులు సూచిస్తున్నారు. అయితే భోజనం చేసిన తర్వాత, అన్నంతో పాటు మామిడిని తీసుకోకూడదు. 
 
స్నాక్స్ టైమ్‌లో స్నాక్స్‌కు బదులు మామిడి పండు సగం మేర తీసుకోవచ్చు. దానివల్ల తగినంత శక్తి లభిస్తుంది. కాబట్టి రోజుకు నాలుగు గంటల గ్యాప్‌లో మూడుసార్లు అరకప్పు మామిడి పండ్ల ముక్కల్ని తీసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి