మునగాకు నూనె గురించి విన్నారా.. ఆరోగ్యానికి ఎంత మేలంటే?

సెల్వి

శనివారం, 13 జులై 2024 (13:23 IST)
Moringa Oil
మునగాకు నూనె గురించి విన్నారా.. ఒకవేళ వినకపోతే.. ఈ కథనం చదవాల్సింది. ఆర్గానిక్ ఆహార పదార్థాలకు ప్రస్తుతం క్రేజ్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఆయుర్వేదం ప్రకారం ఆహారం తీసుకునే వారి సంఖ్య.. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. 
 
ఇక ఆయుర్వేదం సిఫార్సు చేసే కూరల్లో మునగాకు ముఖ్యమైంది. మునగలో ఐరన్ పుష్కలంగా వుంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే మునగాకు నూనెలోని మహిమ తెలిస్తే అస్సలు వదులుకోం. మునగ ఆకులు, కాయలు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అలాగే మునగాకు నూనె కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 
 
మునగ నూనెను మునగ చెట్టు విత్తనాల నుంచి తీస్తారు. ఈ నూనెలో అద్భుతమైన పోషకాలకు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్‌ ఎ, ఇ, సి, బి, యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు పదార్థాలు అధికంగా లభిస్తాయి. మునగాకు నూనె లోని పోషకాలు హెయిర్‌ ఫోలికల్స్‌కు బలాన్నిస్తాయి. ఇది జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. 
 
మునగ వంట నూనెలో స్టిరాల్స్ ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సాయపడతాయి. మునగ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. 
 
యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉండటం వల్ల చర్మానికి అప్లై చేసి మర్ధనా చేయటం వల్ల చర్మం యాక్నె సమస్య తగ్గుతుంది. మునగ నూనెలో విటమిన్ సి, ఇ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి చర్మంపై ఉండే మచ్చలు పూర్తిగా తొలగిపోయేలా చేస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు