స్ట్రాబెర్రీలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడుతుంది. స్ట్రాబెర్రీలు తింటుంటే గుండె ఆరోగ్యంగా వుంటుంది. వీటిని తింటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
స్ట్రాబెర్రీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కనుక ఇది రోగనిరోధక పనితీరుకు అవసరం.
స్ట్రాబెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.