కరోనా వైరస్ దెబ్బకు దేశం లాక్‌డౌన్‌లోకి ఉంది. దీంతో ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లకే పరిమితమయ్యారు. పైగా, దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా తమతమ కుటుంబ సభ్యుల చెంతకు చేరుకున్నారు. లాక్‌డౌన్ పుణ్యమాని భార్యలకు, భర్తలకు దూరంగా ఉంటూ వచ్చిన దంపతులు కూడా ఒక్కటయ్యాయి. ఇలాంటి వారంతా శృంగారంలో మునిగితేలుతున్నారు. ఈ కారణంగా దేశ వ్యాప్తంగా కండోమ్స్, గర్భనిరోధక మాత్రల కొరత ఏర్పడి, డిమాండ్ పెరిగిపోయింది.
మెడికల్ షాపుల్లో ఇలాంటి మాత్రలు విక్రయించినప్పుడు ఎన్ని అమ్ముడుపోయాయో వాటి వివిరాలు నమోదు చేయాలి. అయితే అందుకు భిన్నంగా మెడికల్ షాపుల యజమానులు ఎంట్రీ చేయకుండా దాచిపెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. డాక్టర్ సలహా లేకుండా గర్భనిరోధక మాత్రలు తీసుకుంటే అస్వస్థతకు గురయ్యే అకాశం ఉందని, ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు.