ఒక్క నిమ్మకాయ మీ అనారోగ్యాన్ని పటాపంచలు చేస్తోంది...

సోమవారం, 26 జూన్ 2017 (12:25 IST)
ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మకాయను పిండి తాగితే ఎన్నో లాభాలుంటాయంటున్నారు వైద్యులు. నిమ్మకాయ రసం కారణంగా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. నిమ్మరసాన్ని ప్రతిరోజు తాగితే ఎలాంటి రోగాలు దరిచేరకుండా మందులు వాడాల్సిన అవసరం రాదని చెబుతున్నారు వైద్యులు. రోగ నిరోధక శక్తి, ఇన్ఫెక్షన్లకు నిమ్మరంలో యాంటీ ఆక్సిడెంట్లు, 'సి' విటమిన్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 
 
సహజసిద్ధమైన యాంటి బయాటిక్, యాంటి వైరల్ గుణాలు ఉండటం వల్ల పలు రకాల ఇన్ఫెక్షన్లు ఇట్టే నయమైపోతాయి. శరీరంలో పొటాషియం లెవల్స్ కూడా పెరుగుతాయట. కిడ్నీలో ఒకవేళ రాళ్ళుంటే నిమ్మకాయ రసం కారణంగా నెమ్మదిగా అవి కరిగిపోతాయి. కడుపునొప్పి ఉంటే నిమ్మకాయ రసం ఎంతో మంచి ఔషధమట. 

వెబ్దునియా పై చదవండి