బత్తాయి రసంలో ఆరోగ్య ప్రయోజనాలెన్నో దాగివున్నాయి. స్వీట్ లెమన్, మోసంబి అని పిలువబడే ఈ బత్తాయిలో విటమిన్ సి పుష్కలంగా వుంది. ఇది శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. బత్తాయిలోని పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎముకలకు బలాన్నిస్తుంది. యాంటీ-ఏజింగ్ ఏజెంటుగా పనిచేస్తుంది.
బత్తాయిలో పొటాషియం, ఫాస్పరస్, మినరల్స్ వున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు బత్తాయి రసాన్ని రోజూ ఒక గ్లాసుడు తీసుకోవచ్చు. బత్తాయి రసాన్ని తీసుకోవడం ద్వారా అలసట మాయమవుతుంది.
రక్తంలోని ఎరుపు కణాలను ఇది వృద్ధి చేస్తుంది. రక్తహీనతకు చెక్ పెడుతుంది. పిల్లల్లో పెరుగుదలకు బత్తాయి తోడ్పడుతుంది. వృద్ధుల్లో కీళ్ల నొప్పులను నయం చేస్తుంది. 30 దాటిన మహిళలు రోజు ఒక గ్లాసు బత్తాయి రసం తాగాల్సిందే. జ్ఞాపకశక్తినిని ఇది పెంపొందింపజేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్థులు అరగ్లాసు బత్తాయి రసం, ఆరు స్పూన్ల ఉసిరి రసాన్ని చేర్చి తీసుకోవాలి. తేనెను ఓ స్పూన్ రుచి కోసం కలుపుకోవచ్చు. బత్తాయిలోని లో కేలరీలు బరువును తగ్గిస్తాయి. కంటికి మేలు చేసే బత్తాయి.. చర్మ, కేశ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.