ఎముకలు. మనిషి వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడకుండా కాపాడుకోవాలి. ఎముకలు దృఢంగా ఉంచుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం తీసుకోవలసిన ఆహారం, ఆరోగ్య చిట్కాలను తెలుసుకుందాము. ఎముక పుష్టి కోసం కాల్షియం పుష్కలంగా ఉండే పచ్చని ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు మొదలైనవి తీసుకోవాలి.
నిత్యం వ్యాయామం చేసే వారి ఎముకలు దృఢంగా ఉంటాయి కనుక క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. విటమిన్ డి కోసం కొద్దిసేపు ఎండలో కూర్చోవాలి. చేపలు, గుడ్లు, పాలు, బాదం, మొలకెత్తిన ధాన్యాలు మొదలైనవి తింటుండాలి. ఎముకలను పటిష్టంగా వుండేందుకు తగినంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎందుకంటే ఎముకలు 50 శాతం ప్రోటీన్‌తో తయారవుతాయి.