ఒక సమయం సందర్భం అంటూ లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు భోజనం తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం. ఒక క్రమం ప్రకారం భోజనం చేయకపోవడం వల్ల కడుపులో క్రమక్రమంగా గ్యాస్ (అసిడిటి) సమస్య పెరిగి, శరీరపటుత్వాన్ని కోల్పోవడం, జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
అంతేకాకుండా.. అనోరెక్సియా, బలిమియా, బింగీ అనే వ్యాధులు సోకడానికి కూడా అకాల భోజనమే కారణం. ఈ వ్యాధులు మనషులను శారీరకంగా మానసికంగా కుంగదీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధులు మనుషులపై ఏయే ప్రభావాలు చూపుతాయే ఒక్కసారి పరిశీలిద్దాం.
బలీమియా, బింగీ వ్యాధులకు చాలా సారూప్యత ఉంది. కానీ ఈ రెండు వ్యాధులు దాదాపుగా ఒకేరకమైన ఫలితాలను ఇస్తాయి. ఈ వ్యాధి సోకడం వల్ల శరీరానికి అధిక శ్రమ కలుగుతున్న భావన, నీరసంగా అనిపించడం, వాంతులు కావడం వంటి పరిణామాలు సంభవిస్తాయి.