పల్లీలు తినండి.. బరువు తగ్గండి.. రోజుకు 15 గ్రాములు చాలు..

శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (15:18 IST)
వేరుసెనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వారంలో నాలుగు సార్లు వీటిని తింటే గుండెజబ్బులు చాలా మటుకూ అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే వారానికి రెండు సార్లైనా పల్లీలు తినేవారు బరువు పెరిగే అవకాశం తక్కువని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వేరుసెనగల్లోని రాగి చెడు కొలెస్ట్రాల్‌ స్థాయుల్ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది. తద్వారా గుండె సమస్యలు కూడా అదుపులో ఉంటాయి. వీటిల్లో మోనోశాచురేటెడ్‌ కొవ్వులూ, యాంటీఆక్సిడెంట్లూ ఉంటాయి.
 
రోజూ కనీసం 15 గ్రాముల వేరుసెనగలు లేదా నట్స్ తీసుకునే వారిలో ఆయుష్షు పెరుగుతుందని అధ్యయనాలు తేల్చాయి. వేరుసెనగలు, ఇతర గింజలు(బాదం, జీడి, ఆక్రోట్లు మొదలైనవి), వేరుసెనగ పేస్టును తీసుకునే మధ్య వయస్కులపై జరిపిన పరిశోధనలో వేరుసెనగలు, ఇతర గింజలు తిన్నవారిలో శ్వాస సంబంధిత, గుండె జబ్బులు, నాడీ క్షీణత, డయాబెటిస్‌, క్యాన్సర్‌ తదితర వ్యాధుల కారణంగా ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య తక్కువగా ఉందని తేల్చారు.

వెబ్దునియా పై చదవండి