ఛాతి గింజలతో ఎముకలకు బలం...

మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (10:45 IST)
జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఇలా అనేక రకాల నట్స్ ఉన్నాయి. ఇవే కాకుండా మరో రకమైన నట్స్‌తో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను తెలుసుకుందాం. చెస్ట్‌నట్స్ అంటే ఛాతీ గింజలు. ఈ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అధిక బరువును తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. క్రమంగా ఈ ఛాతీ గింజలను సాయంత్రం సమయంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
ఈ గింజల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఇన్‌ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. ఈ ఛాతీ గింజల్లోని కాపర్ ఎముకల బలానికి చాలా మంచిగా దోహదపడుతుంది. ఎర్రరక్త కణాల సంఖ్యను పెంచుటకు ఈ ఛాతీ గింజలు చక్కగా ఉపకరిస్తాయి. ఈ ఛాతీ గింజలను తరచుగా ఆహారంలో చేర్చుకుంటే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు