నిద్రించే ముందు పుస్తకాన్ని చదివి పడుకుంటే ఏమవుతుంది...?
మంగళవారం, 14 జూన్ 2016 (16:09 IST)
* బెడ్‌రూమ్‌ను ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.
* బెడ్‌రూమ్ ఎక్కువ వేడిగానూ, ఎక్కువ చల్లగానూ ఉండకూడదు.
* సాయంత్రం వేళల్లో కాఫీలు, టీలను, కెఫిన్ ఉండే కూల్‌డ్రింక్స్ తీసుకోకూడదు.
* రాత్రి పూట గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
* ప్రతిరోజూ నిర్ణీత వేళకే నిద్రకు ఉపక్రమించాలి.
* రాత్రి బాగా నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపైనా పగటి వెలుగులో (డే లైట్) గడపాలి.
* నిద్రకు ముందు టీవీలో ఉద్వేగం కలిగించే దృశ్యాలున్న సినిమాలూ, సీరియళ్లు చూడకూడదు.
* గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దానివల్ల బాగా నిద్ర పడుతుంది.
* నిద్రకు ముందు ఆహ్లాదకరమైన మ్యూజిక్ వినాలి.
* ముఖ్యంగా పొగతాగే అలవాటును పూర్తిగా మానుకోండి.
* నిద్రకు ముందు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. కొందరిలో ఆల్కహాల్ నిద్ర పట్టడానికి దోహదం చేసినా అది గాఢనిద్ర దశలోకి వెళ్లనివ్వదు. అందుకే మద్యం తాగి నిద్రలోకి జారుకున్న తర్వాత నిద్రలేచాక రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు.
* నిద్రకు ముందు పుస్తకాలు చదవడం వంటివి చేయవద్దు. పుస్తకం చదువుతూ ఉంటే అలా మనకు తెలికుండానే నిద్రపడుతుందని చాలామంది అనుకుంటారు. కానీ, నిజానికి అలా దృష్టి పూర్తిగా చదవడంలో నిమగ్నమైపోతే నిద్రకు దూరమయ్యే సందర్భాలే చాలా ఎక్కువ.
* ఎప్పుడూ మనలను ఆరోగ్యకరంగా ఉంచే మన మెదడుకు తగినంత విశ్రాంతి కావాలంటే మంచి నిద్ర అవసరం. మంచి నిద్రవల్ల వయసుతో వచ్చే కొన్ని వ్యాధులను నివారించవచ్చు.