డయాబెటిస్ పేషెంట్లు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిదని సలహా ఇస్తుంటారు వైద్య నిపుణులు. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవచ్చా.. తీసుకోకూడదా అనే అనుమానం డయాబెటిస్ పేషెంట్లలో వుంటుంది. ఈ క్రమంలో మధుమేహ వ్యాధిగ్రస్థులు కొబ్బరిని తరచూ తీసుకోవచ్చా అనేది తెలుసుకుందాం.
కొబ్బరిలో బి1, సి, మాంగనీస్, పొటాషియం, కాపర్, ఐరన్, ఫాస్పరస్ వంటి ధాతువులు వుంటాయి. ఇంకా ఇందులో లారిక్ ఆమ్లం వుంటుంది. ఇది అంటు వ్యాధులను ఏర్పరిచే బ్యాక్టీరియా, వైరస్‌లను నశింపజేసే గుణం కలిగివుంటుంది.
మధుమేహ వ్యాధిగ్రస్థులు ఆహారంలో కొబ్బరిని భాగం చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు వుండవు. అయితే కొబ్బరి పాలును మాత్రం ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు.
కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్థులు కొబ్బరి పాలును తీసుకోకూడదు. కొబ్బిరి తురుమును కూరగాయల్లో కలిపి తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది వుండదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.