నిమ్మలో యాంటీ సెప్టిక్ లక్షణాలు, ఆకలి పెంచే గుణాలు అధికంగా ఉన్నాయి. అధికంగా మద్యం సేవించి హేంగోవర్ తలనొప్పితో బాధపడేవారు ఓ కప్పు టీలో కొద్దిగా నిమ్మరసం పిండుకుని తాగితే ఆ తలనొప్పి తగ్గుతుంది. భోజనానికి ముందు రెండు టీ స్పూన్లు నిమ్మరసం తీసుకుంటే నిద్రమత్తు తగ్గుతుంది.
నిమ్మలోని ఫాస్ఫరస్ గుణం ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చేపలు, మాంసం, గుడ్లు వంటివి నిమ్మరసం కలిపి తింటే త్వరగా జీర్ణం అవుతాయి. ప్రతిరోజూ పరగడుపున గ్లాసు నిమ్మరసం తీసుకోవడం ద్వారా జీర్ణకోశం శుభ్రమై, మలబద్ధకం తొలగిపోతుంది. మనిషి లావు తగ్గుతాడు.