ఉల్లిపాయ ఒక యాంటీబయాటిక్. ఇందులో ఔషధ గుణాలు పుష్కలం. అందుకే ఉల్లి శరీరానికి చలువ అంటారు. ఉల్లిని తినాల్సిన అవసరం లేదు. పక్కన ఉంచుకున్నా వైరస్, బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులను కూడా దరిచేరనీయదట. అలాంటి ఉల్లిపాయను ఆరగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని గృహవైద్య నిపుణులు చెపుతున్నారు.
గుండెపోటు, ఆస్తమా, అలెర్జీ, ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు, నిద్రలేమి వంటి ఆరోగ్య సమస్యలకు ఉల్లి మంచి ఔషధం. కాలిన గాయాల మీద ఉల్లిపాయతో మర్దన చేస్తే మంట, నొప్పి తగ్గిపోతాయి. ఇన్ఫెక్షన్, వాపు కూడా రాదు.