10 నిమిషాల వ్యవధిలో 49 వాహనాలు ఢీ - 16 మంది మృతి

సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (17:55 IST)
హూనాన్ ప్రావిన్స్‌లోని చాంగ్‌షా నగరంలోని జుచాంగ్ - గ్వాంగజ్ హైవేవేపై కేవలం 10 నిమిషాల వ్యవధిలో ఏకంగా 49 వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి ఢీకొట్టాయి. ఈ ఘోర ప్రమాదంలో ఏకంగా 16 మంది చనిపోగా మరో 66 మంది మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సీజీటీఎన్ న్యూస్ పోర్టల్ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వరుస ప్రమాదాలు శనివారం సాయంత్రం జరిగాయి. 
 
ఈ రహదారిపై ఒకదాని తర్వాత ఒకటి ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొన్ని వాహనాలు ధ్వంసం కాగా, మరికొన్ని వాహనాల నుంచి మంటలు చెలరేగాయి. దీంతో చాలా మంది వాహనాల్లో చిక్కుకునిపోగా, వారిలో పలువురు గాయపడ్డారు. మరికొందరు మంటల్లో కాలిపోయి ప్రాణాలు కోల్పోయారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు