ఈ దూరం చంద్రుడు-భూమికి మధ్య ఉన్న దూరం కంటే 5.25 రెట్లు ఎక్కువ. అయినప్పటికీ ప్రమాదకర గ్రహశకలాల జాబితాలో దీన్ని కూడా వర్గీకరించవచ్చని నాసా చెప్తోంది. 2001 FO32 లేదా అంతకంటే పెద్ద పరిమాణంలో ఉన్న భూమికి సమీపంలో ఉన్న గ్రహశకలాలకు సంబంధించి 95 శాతానికి పైగా జాబితా చేయబడింది. వచ్చే శతాబ్దం వరకు వీటిలో ఏవి మన గ్రహంపై ప్రభావం చూపవని నాసా తెలిపింది.
భూమిని తాకేందుకు ఇతర గ్రహశకలాల పోలిస్తే 2001 FO32 ఆస్ట్రాయిడ్ గంటకు 77 వేల మైళ్ల వేగంతో వెళ్తుందని నాసా తెలిపింది. ప్రస్తుతం ఈ ఆస్ట్రాయిడ్ గురించి పెద్దగా తెలియదని, దీని గురించి మరింత క్షుణ్నంగా తెలుసుకోవడాననికి ఇది అద్భుతమైన అవకాశమని నాసా జెట్ ప్రోపల్షన్ లేబరేటరీ ప్రధాన శాస్త్రవేత్త లాన్స్ బెన్నర్ అన్నారు.
ఖగోళ శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలం పరిమాణాన్ని అర్థం చేసుకోవాలని, ఉపరితలం నుంచి ప్రతిబింబించే కాంతి అధ్యయనం చేయడం ద్వారా దీని గురించి తెలుసుకోవాలని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సూర్యరశ్మి ఈ ఆస్ట్రాయిడ్ ఉపరితలాన్ని తాకినప్పుడు శిలలోని ఖనిజాలు.. కొన్ని తరంగదైర్ఘ్యాలను గ్రహిస్తాయి. మరికొన్నింటిని ప్రతిబింబిస్తాయని నాసా చెప్పింది.