ప్రపంచాన్ని ప్రస్తుతం మీ టూ ఉద్యమం షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రముఖులందరూ మీ టూ ఉద్యమానికి మద్దతు తెలిపారు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు, అప్పట్లో వైట్ హౌస్ ఉద్యోగి మోనికా లూయిన్ స్కీకి మధ్య ఉన్న అఫైర్ గురించి నోరు విప్పారు. అప్పట్లో ఈ అఫైర్ ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషనల్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా మీటూ ఉద్యమం నేపథ్యలో ఆ అఫైర్ మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ.. ఆ అఫైర్‌కు, అధికార దుర్వినియోగానికి ఎలాంటి సంబంధం లేదని తన భర్తను వెనకేసుకుని వచ్చారు. ఈ అఫైర్ కారణంగా అధ్యక్ష పదవికి తన భర్త రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.
మోనికాతో తన అఫైర్‌కు సంబంధించి అబద్ధాలను చెప్పిన బిల్ క్లింటన్ అప్పట్లోనే తన పదవి నుంచి దిగిపోతే బాగుండేదని న్యూయార్క్ సెనేటర్ గిల్లిబ్రాండ్ చేసిన వ్యాఖ్యలపై హిల్లరీ క్లింటన్ స్పందించారు. ఆ అఫైర్ కారణంగా పదవి నుంచి దిగిపోవాల్సిన అవసరం లేదన్నారు. ఆ ఘటన జరిగిన సమయంలో మోనికా వయసు 22 ఏళ్లని... అప్పటికే ఆమె వయోజనురాలు (అడల్ట్) అని చెప్పారు.