జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజర్ దుశ్చర్యలన్నిటికీ ‘పక్కాఆధారాలు’ ఉన్నాయని భారత్ స్పష్టం చేసింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతుతో అమెరికా ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో చేసిన ప్రతిపాదనకు చైనా మోకాలడ్డిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో సరైన ఆధారాలు చూపాలన్న చైనా డిమాండ్‌పై భారత్ తాజాగా స్పందించింది.