తమ అభిమాన నటుడు నాగార్జున స్వయంగా కార్యాలయానికి రావడంతో అక్కడి సిబ్బంది, అధికారులు ఆయనతో సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు పోటీపడ్డారు. నాగార్జున కూడా వారిని నిరాశపరచకుండా వారితో కలిసి సరదాగా ఫోటోలకు పోజులిచ్చారు. సిబ్బందితో కాసేపు ముచ్చటించి అనంతరం తనవాహనంలో అక్కడి నుంచి నిష్క్రమించారు.