కోవిడ్ కోరల్లో చైనా.. 13,146 కొత్త కేసులు... లాక్‌డౌన్

సోమవారం, 4 ఏప్రియల్ 2022 (11:12 IST)
చైనా మరోసారి కోవిడ్ కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. కరోనా తొలి వేవ్‌తో పోలిస్తే ఇప్పుడు చైనాలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని గణాంకాలను బట్టి తెలుస్తోంది. 
 
ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 13,146 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో దాదాపు 70 షాంఘైలోనే బయటపడ్డాయి. దీంతో అక్కడ కఠిన లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. 
 
ఆ నగరం పరిధిలో ప్రతి పౌరుడికి చెరో రెండు (యాంటీజెన్‌, న్యూక్లిక్‌ యాసిడ్‌) కోవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు