వక్షోజాలను తాకట్టు పెట్టి హనీమూన్‌కు ప్లాన్... చైనా యువతి వింత ఆలోచన

శుక్రవారం, 14 అక్టోబరు 2016 (13:33 IST)
హనీమూన్ వెళ్ళడానికి డబ్బుల్లేక ఓ యువతి వక్షోజాలను తాకట్టు పెట్టిన వింత ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... చైనాకు చెందిన ఒక యువతికి ఇటీవలే వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె హనీమూన్‌కు వెళ్లాలనుకుంది. అయితే అందుకు ఆమె దగ్గర డబ్బుల్లేవు. దీంతో ఆమె వినూత్నమైన పని చేసింది. 
 
అదేంటంటే ఆమె వక్షోజాలను తాకట్టు పెట్టింది. ఎవరైనా ఆమె వక్షోజాలను తాకవచ్చు. ఇందుకోసం ఆమెకు కొంత డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. అయితే ఆమె ప్రయత్నానికి విశేష స్పందన వచ్చింది. ఆమెను తాకడానికి వచ్చిన వారిలో మగవారితో పాటు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అలా వచ్చిన డబ్బును ఆమె హనీమూన్ కోసం ఖర్చు చేయనుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వెబ్దునియా పై చదవండి