ఓ యువతి కడుపులో 4-Feet పాము.. వాంతులు చేసుకున్న వైద్యులు

మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (17:01 IST)
snake
రష్యాలో ఓ యువతి కడుపులో నుంచి డాక్టర్లు నాలుగు అడుగుల పామును వెలికి తీశారు. తన కడుపులో పాము ఎలా కడుపులోకి చేరిగో తనకు ఏ మాత్రం తెలీదని యువతి చెప్పుకొచ్చింది. వివరాల్లోకి వెళితే.. అర్థరాత్రి ఆమె గాఢ నిద్రలో ఉండగా పాము ఆమె కడుపులోకి చేరి ఉంటుందని వారు భావిస్తున్నారు. ఈ ఉదంతం ప్రస్తుతానికి ఓ పజిల్‌లా మారింది. 
 
అయితే.. ఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం కడుపులో ఏదో ఇబ్బందిగా ఉండటంతో ఆమె ఆస్పత్రికి వెళ్లింది. యువతిని పరీక్షించిన డాక్టర్లకు ఆమె కడుపులో ఏదో వస్తువు ఉన్నట్టు అర్థమైంది. ఆ తరువాత.. ఓ గట్టం ద్వారా ఆ వస్తువును బయటకు లాగిన డాక్టర్లకు వాంతులు వచ్చినంత పనైంది. కారణం.. వారు బయటకు లాగిన వస్తువు.. ఓ పాము. ఆమె నోటి గుండా పామును బయటకు లాగుతుండగా చిత్రీకరించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

زحف عبر فمها أثناء نومها.. فيديو مروع للحظة سحب ثعبان من حلق امرأة https://t.co/6iUSk3oU2U#البيان_القارئ_دائما pic.twitter.com/3Q1YiYdV7R

— صحيفة البيان (@AlBayanNews) August 31, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు