టాయిలెట్ రంధ్రంలో దాగిన పాము... సరిగ్గా మలవిసర్జన సమయంలో చూసి...

బుధవారం, 19 ఆగస్టు 2020 (19:12 IST)
కొన్ని సమయాల్లో పాములు గృహావాసాల్లోకి వస్తున్నాయి. అలాంటి పాములు ఇళ్లలోకి ప్రవేశించి.. మరుగు ప్రదేశాల్లో తిష్టవేస్తున్నాయి. ముఖ్యంగా, వంట గదులు, బాత్రూమ్‌లు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్‌లు వంటి ప్రదేశాల్లో ఉంటున్నాయి. ఇక్కడ ఓ పాము ఏకంగా టాయిలెట్ రంధ్రంలోకి వెళ్లి దాక్కుంది. ఇది చూడని ఇంటి యజమాని మల విసర్జనకు వెళ్లాడు.. సరిగ్గా మలవిసర్జన సమయంలో ఆ పాము బుసలు కొడుతూ పైకి వచ్చింది. అంతే.. ఆ యజమాని ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పరుగుపెట్టాడు. ఈ ఘటన టెక్సాస్ నగరంలో చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, టెక్సాస్‌ నగరానికి చెందిన పేట‌న్ మ‌లోన్ అనే వ్య‌క్తి ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో చూసిన‌ట్ల‌యితే ఒక చిన్నపాము టాయిలెట్ సీటు (రంధ్రం)లోకి దూరింది. తీరా మలవిసర్జన సమయంలో ఇది తలపైకెత్తి అటూ ఇటూ చూడసాగింది. అంతే.. ప్రాణభయంతో యజమాని పరుగు లంఘించాడు. ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కు 1 మిలియ‌న్ల మంది వీక్షించారు.

 

I always thought this was an irrational fear of mine...apparently not. Friend out in west Texas found this.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు