ప్రస్తుతం కరోనా వైరస్ 149 దేశాల్లో విశ్వరూపం చూపించింది. ఆ వైరస్ పుట్టిన చైనాలో మాత్రం వ్యాప్తి గణనీయంగా తగ్గిపోతే, ఇతర దేశాల్లో మాత్రం ఈ వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో కూడా ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. దీంతో అమెరికా దేశ వ్యాప్తంగా ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించారు. భారత్ కూడా కరోనా వైరస్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించింది.
ఇటీవల బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో, ఆయన కమ్యూనికేషన్ చీఫ్ ఫాబియోలను డోనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. ఆపై ఫాబియోకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో డోనాల్డ్ ట్రంప్‌కు కూడా ఈ వైరస్ పరీక్షలు చేశారు. కాగా, కాగా, అమెరికాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు 5 వేల కోట్ల డాలర్లు విడుదల చేస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.