పైగా, తన ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు భారత్ కుట్ర పన్నిందని, ఖాట్మండూలోని భారత రాయబార కార్యాలయం నుంచే ఈ ఆపరేషన్ నడుస్తోందని ఆరోపించారు. కానీ తనను తొలగించడం సాధ్యం కాదని ఓలీ అన్నారు.
కాగా, ఇటీవల భారత్‌కు చెందిన లిపులేఖ్, కళాపాణి, లింపియాధురా ప్రాంతాలను తమ దేశ పరిధిలోకి చేర్చి, వాటితో రూపొందించిన కొత్త రాజకీయ పటాన్ని తయారు చేసింది. దీనికి రాజ్యాంగంలో చేసిన సవరణను నేపాల్ పార్లమెంటు జూన్ 13న ఆమోదించింది.