అమెరికాలో వివిధ రకాల నేరాలకు పాల్పడేవారికి విధించే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. తాజాగా చదువుకునేందుకు అమెరికాకు వెళ్లిన ఓ భారతీయ విద్యార్థికి ఏకంగా పదేళ్ళ జైలుశిక్షను కోర్టు విధించింది. ఇతను చేసిన నేరం ఏంటో తెలుసా? 11 యేళ్ల బాలికతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే. ఈ కేసులో నేరం రుజువు కావడంతో కోర్టు 10 యేళ్ల జైలుశిక్షను విధించింది.
భారత్‌కు చెందిన 23 యేళ్ళ సచిన్ భాస్కర్ అనే విద్యార్థి విద్యార్థి విసాపై అమెరికాకు వెళ్లాడు. అక్కడ, మైనర్ బాలికను లోబరుచుకున్నాడు. విద్యార్థిని లైంగికంగా ప్రలోభపెట్టే విధంగా ఈమెయిల్ ద్వారా మెసేజ్ పంపాడు.