ఏసుక్రీస్తుపై షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. జెరుసలేం హోలీ సెపల్చేర్‌లోని ఏసుక్రీస్తు సమాధిని గతవారం మొట్టమొదటిసారిగా తెరిచారు. కానీ ఏసు క్రీస్తు విశ్రాంతి తీసుకుంటున్న ప్రదేశం అదొక్కటే కాదు. 30 ఏడీలో మృతిచెందిన సమాధులు భారత్, జపాన్‌లలో కూడా ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.
ఏసుక్రీస్తు శిలువ చేసిన అనంతరం ఆయన దేహాన్ని సమాధి చేసేందుకు ప్రత్యేకమైన బండరాళ్లతో చిన్న నిర్మాణాన్ని తయారు చేశారు. దీన్ని ఎడిక్యూల్ అని పిలుస్తారు. జెరుసలేంలోని బోలీ సెపల్చేర్ చర్చిలో అసలైన జీసస్ సమాధి ఉందనే ప్రచారం జరిగింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంద్రి క్రైస్తవుల దృష్టిని కూడా ఈ చర్చి ఆకర్షిస్తోంది. అయితే చరిత్రకారులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు.
జెరుసలేంలోని టాల్పాయిట్ పట్టణంలో 1922లో నిర్మితమైంది. 1980లో టాల్పాయిట్‌లో జరిగిన తవ్వకాల్లో పూర్వికులకు సంబంధించిన ఎముకలు, దేహాలను భద్రపరిచే అత్యంత పురాతన పేటికలు లభ్యమవడమే ఇందుకు కారణం. వీటిపై పరిశోధనలు చేసిన ఆర్కియాలజిస్టులు, బిబ్లికల్ స్కాలర్లు ఒకరినొకరు ఏకీభవించుకోలేదు.
జీసస్‌కు శిలువ వేయలేదని, ఆయన భారత్‌కు వలస వచ్చి జీవనం కొనసాగించినట్లు 1800వ సంవత్సరంలో స్థాపించిన అహ్మదీ ముస్లిం ఫెయిత్ అనే సంస్థ చెబుతోంది. ఉత్తర కశ్మీర్ లోని రోజాబాల్ అనే పుణ్య ప్రదేశంలో క్రీస్తు దేహాన్ని సమాధి చేసినట్లు పేర్కొంది.