కుర్రోడి అల్లరి చేష్టలు.. తల్లి మెడకు సైకిల్‌ లాక్‌.. అన్‌లాక్ కోడ్ మరిచాడు..

ఆదివారం, 17 అక్టోబరు 2021 (13:52 IST)
ఓ కుర్రోడు కొంటి చేష్టలతో ఆ బాలుడు తల్లి ప్రాణభయంతో వణికిపోయింది. ఈ అల్లరి బాలుడు తన తల్లి మెడకు సైకిల్‌ లాక్‌ వేశాడు. అయితే ఆ లాక్‌ను తెరిచే కోడ్‌ (అన్‌లాక్)ను మరిచిపోయాడు. దీంతో భయాందోళన చెందిన ఆ తల్లి అధికారుల సహాయం కోరింది. చివరకు కట్టర్‌తో కట్‌ చేసి దానిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ ఘటన చైనా జియాంగ్సు ప్రావిన్స్‌లోని హువాన్‌లో ఈ నెల 7న జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సైకిల్‌ లాక్‌తో ఆడుకుంటున్న ఒక బాలుడు సరదాగా తల్లి మెడకు దానిని తగిలించి లాక్‌ వేశాడు. అయితే ఆట సమయంలో అన్‌‌‍లాక్‌ కోడ్‌ను అతడు పలు మార్లు మార్చేశాడు.
 
ఈ విషయాన్ని గుర్తించిన ఆ తల్లి, లాక్‌ తెరిచే కాంబినేషన్‌ తెలియక కంగారు పడింది. సమీప పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సహాయం కోరింది. వారు అగ్నిమాపక బృందాన్ని పిలిపించారు. ఒక టవల్‌ను ఆమె మెడకు ఉంచి వైర్‌ కట్టర్‌తో సైకిల్‌ లాక్‌ను కట్‌ చేసి తొలగించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు