అమెరికా తెస్తున్న కొత్త వీసాల నిబంధనల ప్రభావం అన్ని దేశాలపైనా పడుతోంది. అత్యవసరమైతే తప్ప అమెరికా పర్యటనను వాయిదా వేసుకోవాలని నైజీరియా ప్రభుత్వం ఆ దేశ ప్రజలను కోరింది. వలసదారులకు సంబంధించి తీసుకొస్తున్న మార్పులు, నిబంధనలపై స్పష్టత వచ్చేంతవరకు అమెరికా పర్యటనలను వాయిదా వేసుకోవడం మంచిదని నైజీరియా అధ్యక్షుడి విదేశీ వ్యవహారాల సలహాదారు అబైక్ ఎరేవా సోమవారం ఒక ప్రకటనలో ఆ దేశ ప్రజలకు సూచించారు.
అమెరికాలో ప్రవేశించడానికి మల్టిపుల్ వీసాలు ఉన్నప్పటికీ గడిచిన కొద్ది వారాలగా అమెరికా విమానాశ్రయాల్లో ఇమిగ్రేషన్ అధికారులు అనేక మందికి వీసా ఇవ్వకుండా నైజీరియన్లను వెనక్కి తిప్పి పంపిస్తున్నారని, అందుకు ఇమిగ్రేషన్ అధికారులు ఎలాంటి కారణాలను వివరించడం లేదని ఆమె పేర్కొన్నారు.