తాజాగా ఈ దేశంలోని ఆక్లాండ్‌లో ఒక కరోనా కేసు వెలుగుచూడటంతో వైరస్ వ్యాప్తి నియంత్రణకుగానూ దేశవ్యాప్తంగా మూడు రోజులపాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ కేసును డెల్టా వేరియంట్‌గా అనుమానిస్తున్నాం. ఇది చాలా ప్రమాదకరమైనది. మేం దానికి తగినట్లు స్పందిస్తున్నాం. ఎంత వీలైతే అంత త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నామని జెసిండా తెలిపారు.
ఇదిలావుంటే, దాదాపు ఏడాది తర్వాత ఇక్కడ దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం గమనార్హం. సదరు వ్యక్తి కొవిడ్ టీకా తీసుకోలేదని, ఆగస్టు 12 నుంచి వైరస్‌తో బాధపడుతున్నట్లు గుర్తించామని ఆరోగ్యశాఖ డైరెక్టర్ జనరల్ ఆష్లే బ్లూమ్‌ఫీల్డ్ తెలిపారు. అతను తన భార్యతో కలిసి వారాంతంలో స్థానికంగా పర్యటించాడని.. రగ్బీ ఆటను చూసేందుకు వెళ్లాడని చెప్పారు. దీంతో ఏడు రోజులపాటు లాక్డౌన్ విధించినట్లు చెప్పారు.