చంద్రయాన్ 2 విఫలం కావడంపై పాకిస్తాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ చౌదరి శనివారం తెల్లవారుజామున పనికిమాలిన ట్వీట్ చేశాడు. భారతదేశం ఇస్రో అంతరిక్ష సంస్థ తన విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాన్ని కోల్పోయిన తరువాత విషయాన్ని తెలియజేసింది. విక్రమ్ చంద్రునిపైకి దిగుతున్నప్పుడు, చంద్రుని ఉపరితలం చేరుకోవడానికి ముందే దానితో 2.1 కిలోమీటర్ల దూరంలో వున్నప్పుడు కమ్యూనికేషన్ కోల్పోయింది.
మీరు మారరా... కనీసం తాము చంద్రుని దాకా వెళ్లామనీ, ఈ విషయంలో మీరు ఎక్కడున్నారంటూ గాడిదపై వున్న బొమ్మను పెట్టి కసి తీర్చుకున్నారు. ఐతే తన ట్వీట్ పైన ట్రోల్ చేయడంపై చౌదరి మళ్లీ స్పందిస్తూ 900 కోట్లండీ... అందుకే అలా ట్వీట్ చేశానంటూ మళ్లీ పేర్కొన్నాడు.