భారత్‌తో సహా ఏడు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై విధించిన నిషేధాన్ని ఫిలిప్పీన్స్ ప్రభుత్వం జూన్ 15వ తేదీ వరకు పొడగించింది. భారత్, పాక్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఒమన్, యూఏఈ నుంచి ప్రయాణికులపై నిషేధం పొడగించినట్లు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సోమవారం పేర్కొంది.
ఇదిలావుండగా, ఫిలిప్పీన్స్‌లో నిన్న 6,684 కరోనా కేసులు రికార్డయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 12,30,301కు చేరుకుంది. వైరల్ వ్యాధితో మరో 107 మంది రోగులు మరణించడంతో.. మృతుల సంఖ్య 20,966కు పెరిగింది.