కానీ, మోడల్ సల్మా అల్-షిమి ఎలాంటి అనుమతి లేకుండా ఈజిప్టు దుస్తులు, నగలు ధరించి ఫోటోషూట్‌లో పాల్గొంది. ఆ తర్వాత టిక్‌టాక్ వీడియో తయారు చేసింది. ఈ వీడియోను గత వారం షిమి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.
ఈ వీడియోలో ఆమె జోజర్‌కు చెందిన 4,700 ఏండ్ల స్టెప్ పిరమిడ్ కింది భాగంలో పోజులిచ్చింది. ఈ ఈజిప్టు మోడల్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
మోడల్ షిమితోపాటు ఫొటోగ్రాఫర్ హౌసం మొహమ్మద్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, 500 ఈజిప్టు పౌండ్లు చెల్లించిన మీదట వీరిద్దరికీ బెయిల్ మంజూరైంది. మోడల్ షిమితో పాటు ఫొటోగ్రాఫర్‌ను అరెస్ట్ చేయడంపై సోషల్ మీడియాలో కొంతమంది నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.