ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పాక్ ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ తన వాదన వినిపించారు. ఫర్హాద్‌ను పీఓకే పోలీసులు అరెస్టు చేశారని, పీఓకే విదేశీ భూభాగమని పేర్కొన్నారు. అక్కడ ప్రత్యేక కోర్టులు, పోలీసు వ్యవస్థ వున్నాయని అన్నారు. ఆ భూభాగం తమ పరిధిలోకి రాదన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ అది విదేశీ భూభాగమైతే పాక్ మిలిటరీ నిత్యం పీఓకేలోకి ఎందుకు చొరబడుతుందని సూటి ప్రశ్న వేశారు.
ఐఎస్ఐ జనాలను అపహరించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, ధిర్కోట్ పోలీసులు ఫర్హాద్‌ను అరెస్టు చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలావుంచితే, పీఓకే ఎప్పటికీ భారత్ భూభాగమేనని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.